సూపర్ బజార్‌లో గిరిజన ఉత్పత్తులు
● అందుబాటులోకి తెచ్చిన జీసీసీ
కొయ్యూరు: మండలంలోని రాజేంద్రపాలెంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేసిన సూపర్ బజార్‌లో గిరిజన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. గతంలో జీసీసీ ఉత్పత్తి చేసే వాటిలో కొన్ని మాత్రమే ఇక్కడ ఉండేవి. ఇప్పుడు అన్ని రకాల వస్తువులు తేవడంతో కొనుగోలుదారులు ఆశక్తి చూపుతున్నారు. అ మ్మకాలు పెరిగాయి. సబ్బులు,షాంపులతో పాటు అరకు కాఫీని విక్రయిస్తున్నారు. నిత్యా వసర వస్తువులను అందుబాటులో ఉంచారు.
కొయ్యూరు సంత కళకళ
కొయ్యూరు: మండలకేంద్రంలో ఆదివారం జరిగిన సంత గిరిజనులతో కళకళలాడింది.క్రిస్మస్ తర్వాత నిర్వహించిన సంత కావడంతో ఎక్కువ మంది తరలి వచ్చారు. సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో వస్త్ర దుకాణాల సంఖ్య పెరిగాయి.


