వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
చింతూరు: పోతనపల్లి సమీపంలో ఆదివారం కారు చెట్టుకు ఘటనలో తెలంగాణలోని సారపాకకు చెందిన నలుగురికి గాయాలయ్యాయి. సారపాకకు చెందిన ఓ కుటుంబం మారేడుమిల్లి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో బిందు అనే మహిళకు, అక్షశ్రీ అనే చిన్నారికి తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి చింతూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం తరలించారు.
గుర్తుతెలియని వాహనం ఽఢీకొని
భార్య, భర్తలకు గాయాలు
చింతపల్లి: లంబసింగి–రాజుపాకలు గ్రామాలు మధ్య జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యాభర్తలు గాయాలుపాలైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ పరిధిలో జాజలుబంద గ్రామానికి చెందిన రాజుబాబు, అతని భార్య రాణిలు కలసి చింతపల్లి మండలంలో గల రాజుపాకలు గ్రామంలో గల బంధువుల ఇంటికి శనివారం వచ్చారు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా రాజుపాకలు వంతెన వద్ద గుర్తు తెలియని కారు ఽఢీకొని ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. దీంతో వాహనం నుంచి పడిపోయి గాయపడిన వారిని స్థానికులు చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరిలించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేిసి దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు


