గిరిజన యువతకుఉపాధి కల్పనకు చర్యలు
● జాబ్‌మేళాలలో 59 మందికి
ఉపాధి అవకాశాలు
● ఏపీవో రమణ
రుంపచోడవరం: ఏజెన్సీలో చదువుకున్న యువతకు ప్రైవేట్ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం ఐటీడీఏ ఏపీవో డి.ఎన్.వి.రమణ అన్నారు. రంపచోడవరం వైటీసీలో శనివారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 112 మంది అభ్యర్థులు హాజరు కాగా వీరిలో 59 మంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలకు ఎంపికై నట్టు ఏపీవో తెలిపారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ, నవత ట్రాన్స్‌పోర్టు, టీవీఎస్ సుందరం, ఎల్‌అండ్‌టీ, టాటా ఎలక్ట్రానిక్స్ తదితర సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధ సంస్ధ అధికారి రోహిణి తదితరులు పాల్గొన్నారు.


