30 నుంచి గిరిజన యవ సమ్మేళనం
ఏయూక్యాంపస్: విశాఖ వేదికగా ఈ నెల 30 నుంచి జనవరి 5వ తేదీ వరకు 17వ జాతీయ గిరిజన యువ సమ్మేళనం నిర్వహించనున్నట్లు మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి.మహేశ్వర రావు తెలిపారు. శనివారం బీచ్‌రోడ్డులోని సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఏపీ రాష్ట్రాలకు చెందిన 200 ఆదివాసీ యువత పాల్గొంటారన్నారు. ఆదివాసీ సంప్రదాయాలు, కళలు, ప్రదర్శిస్తారన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయన్నారు. మై భారత్ రిసోర్స్ పర్సన్ ఎన్.నాగేశ్వర రావు, ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డు గ్రహీత ఆర్.లీలాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


