దంతేవాడ వరకే కిరండూల్ పాసింజర్
తాటిచెట్లపాలెం: కె.కె.లైన్‌లో జరుగుతున్న ఆధునికీకరణ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే కిరండూల్ పాసింజర్ ఆయా తేదీల్లో గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28, 29, 30, 31 జనవరి 1, 2, 4, 6, 7, 8, 10వ తేదీల్లో విశాఖపట్నం–కిరండూల్(58501)పాసింజర్ దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ఈ నెల 29, 30, 31 జనవరి 1, 2, 4, 6, 7, 8, 9, 11వ తేదీల్లో కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ తేదీల్లో దంతేవాడ–కిరండూల్ మధ్య ఈ రైలు రాకపోకలు సాగించదు.


