మంచు ముసుగులో మన్యం
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో దట్టంగా పొగమంచు కురుస్తుంది.ఉదయం 9గంటలైనా మంచు తెరలు వీడడం లేదు. వాహనచోదకులు హెడ్‌లైట్ల వెలుతురులో రాకపోకలు సాగిస్తున్నారు.రోజు రోజుకు చలి తీవ్రత కూడా పెరుగుతుంది.సాయంత్రం 4గంటల నుంచి చలి మొదలవుతుంది.చలి నుంచి ఉపశమం పోందేందుకు గ్రామాల్లో గిరిజనులు చలి మంటలు వేసుకుంటున్నారు. చలి,మంచుతో అవస్థలు పడుతున్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని పోగమంచు దట్టంగా కురుస్తుండటంతో ఉష్ణొగ్రతల సంఖ్యకు పడిపోతున్నయి. దట్టమైన మంచుకారణంగా గిరిజనులు, విద్యార్ధులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతు చలిమంటలను ఆశ్రయిస్తు చలికాస్తున్నరు. పాఠశాలలకు వెల్లే విద్యార్ధులు మంచుకు వణుకుతు పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం డుంబ్రిగుడలో అధిక పోగ మంచుతో కూరగాయాలు ఇతర పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని గిరిజనులు అంటున్నారు. చలితో ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నరు.
మంచు ముసుగులో మన్యం
మంచు ముసుగులో మన్యం


