పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి
అడ్డతీగల: విద్యాలయాల్లో విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వ మానవ వనరుల విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఎం.నాయక్ అన్నారు.శనివారం ఆయన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి,ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్‌తో కలిసి పాఠశాలలను సందర్శించారు. గురుకుల పాఠశాల,ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించి, అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలన్నారు.విద్యతో పాటు ఉపాధ్యాయులు వ్యక్తిగత,పరిసరాల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూనే విద్యార్ధులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు అసౌకర్యంగా ఉండడంతో వెంటనే నిధులు కేటాయించి పనులు చేయించి విద్యార్థినులకు మరుగుదొడ్లు అందుబాటులోనికి తీసుకురావాలని ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌ని ఆదేశించారు. మిట్లపాలెంలో మద్యస్తంగా నిలిచిపోయిన చిన్నతరహ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిత ప్రాంతాన్ని పరిశీలించారు. వేటమామిడి జలవిద్యుత్ కేంద్రం పరిశీలించి ఉత్పత్తి,పనితీరుని అడిగి తెలుసుకున్నారు.
సీహెచ్‌సీని పరిశీలించిన ఎస్టీ కమిషన్ చైర్మెన్
అడ్డతీగల సిహెచ్‌సిని రాష్ట్ర ఎస్‌టి కమీషన్ చైర్మెన్ సోళ్ళ బొజ్జిరెడ్డి శనివారం పరిశీలించారు.రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు.ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను సూపరింటెండెంట్ పండా సతీష్‌ని అడిగి తెలుసుకున్నారు. రోగుల అవసరాలకు అదనపు సౌకర్యాల అవసరముంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.గిరిజన సంక్షేమశాఖ డీడీ రుక్మాంగదయ్య, బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎ.స్వప్నకుమారి ఇతర అధికార్లు పాల్గొన్నారు.
పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి


