మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడుకు నివాళి
సాక్షి,పాడేరు: దివంగత మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులోని మణికంఠ కాంప్లెక్స్ వద్ద ఆయన విగ్రహానికి కుమార్తె, పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ తమర్భ నరసింగరావు దంపతులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా పలు పార్టీల నేతలు తరలివచ్చారు. పేదలకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి చిట్టినాయుడు పాడేరుతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు అబ్బాయిదొర, ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త సింహాచలం నాయుడు, అయ్యప్పస్వామి ఆలయ ధర్మకర్త సుబ్బారావు, సర్పంచ్ వెంకటరమణరాజు, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్తాడి రామారావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కొట్టగుళ్లి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


