●భక్తులతో కిక్కిరిసిన సింహగిరి
సింహగిరి గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయత్రం వరకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. దర్శన క్యూలు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, కేశఖండనశాల, ఆర్టీసీ బస్సులు, దేవస్థానం బస్సులు, అన్నప్రసాద భవనం ఎక్కడ చూసినా జనమేజనం. అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలు, కార్లు సింహగిరికి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. లోవతోట, సింహగిరి బస్టాండ్ ఏరియా, పీఆర్వో కార్యాలయం, గజపతిసత్రం, హిల్‌టాప్ రోడ్డులో వాహనాల పార్కింగ్ చేసినా ట్రాఫిక్ సమస్య తీరలేదు. – సింహాచలం
●భక్తులతో కిక్కిరిసిన సింహగిరి


