అంబులెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
అరకులోయటౌన్: అరకులోయ ఏరియా ఆస్పత్రికి కేటాయించిన రెండు అంబులెన్స్‌లను అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం బుధవారం ప్రారంభించారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి కేటాయించిన నిధులతో ఒక అంబులెన్స్‌తో పాటు యూనివర్సల్ సంపో జనరల్ ఇన్సూరెన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సురక్ష అమేషా ఆప్కేసైథ్ నిధులతో మంజూరు చేసిన మరో అంబులెన్స్‌లను ఎమ్మెల్యే కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లు అరకులోయ ఏరియా ఆస్పత్రికి ఒకటి, డుంబ్రిగుడ పీహెచ్‌సీకి ఒకటి కేటాయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ అత్యవసర వేళల్లో 24 గంటలు ఈ ఆంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. అంబులెన్స్‌లు కేటాయించిన అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి, యూనివర్సల్ సంపో జనరల్ ఇన్సూరెన్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అంబులెన్స్ సేవలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, యువజన నాయకుడు రేగం చాణిక్య, ఎంపీటీసీ సభ్యులు దురియా ఆనంద్‌కుమార్, సమర్ధి శత్రుఘ్న, స్వాభి రామచందర్, కూడా పాపారావు, సర్పంచ్ సుబ్బారావు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి నరసింహమూర్తి, నియోజకవర్గం బూత్ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్, మండల బూత్ కమిటీ ఇన్‌చార్జి బోయి కిరణ్‌కుమార్, వార్డు సభ్యుడు శివ, పార్టీ నాయకులు అర్జున్, నాగరాజు, జగన్, జన్ని అర్జున్, నగేష్, కామేశ్వరరావు, శంకర్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


