మన్యంలో క్రిస్మస్ కాంతులు
సాక్షి, పాడేరు: జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. గిరిజన పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రార్థనా మందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ కాంతులు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
నాటి జ్ఞాపకం.. నేడు పర్యాటక స్వర్గం
అరకులోయ మండలం సుంకరమెట్టలో ఉన్న పురాతన ప్రార్థనా మందిరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఇది ఏజెన్సీలోనే నిర్మించిన మొట్టమొదటి చర్చి.1934లో కెనడాకు చెందిన డాక్టర్ రాల్ఫ్ స్మిత్ ఇక్కడికి వచ్చి గిరిజనులకు వైద్య సేవలు అందించేవారు. జైపూర్ మహారాజుల అనుమతితో, స్థానిక గిరిజనుల సహకారంతో కొండపై ఈ చర్చిని నిర్మించి, 1939 సెప్టెంబర్ 17న ప్రారంభించారు.
పర్యాటక ఆకర్షణ: అరకు–అనంతగిరి రహదారిలో కొండపై అందంగా కనిపించే ఈ చర్చి ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా, సినిమా షూటింగ్‌లతో విరాజిల్లుతోంది.
● పాడేరు ప్రాంతంలో క్రైస్తవ ప్రార్థనల వ్యాప్తికి 1970లో పునాది పడింది. డాక్టర్ రాల్ఫ్ స్మిత్ జ్ఞాపకార్థం కాకినాడ సీబీఎం మిషన్‌కు చెందిన జెస్సీ రోజర్ పాడేరులో సీబీఎం చర్చిని ప్రారంభించారు. అక్కడి నుంచే జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూరు, గూడెంకొత్తవీధి తదితర ప్రాంతాలకు ప్రార్థనా మందిరాలు విస్తరించాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 500కు పైగా చర్చిలు ఉన్నాయి.
మురిసిపోతున్న మన్యం
క్రిస్మస్‌కు ముందే పాడేరు, అరకు తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. తెల్లవారుజామునే వినిపిస్తున్న కీర్తనలు భక్తి గీతాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నాయి. అన్ని చర్చిలు విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్నాయి. శాంతి, ప్రేమల సందేశంతో ఏజెన్సీ వాసులు ఈ ఏడాది క్రిస్మస్‌ను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు.
పాడేరులో విద్యుత్ దీప కాంతుల్లో సీబీఎం చర్చి
మన్యంలో క్రిస్మస్ కాంతులు
మన్యంలో క్రిస్మస్ కాంతులు
మన్యంలో క్రిస్మస్ కాంతులు
మన్యంలో క్రిస్మస్ కాంతులు


