కరాటే పోటీల్లో బాలికల సత్తా
● జాతీయ స్థాయిలో ఐదు బంగారు, మూడు వెండి పతకాలు సాధన
● అభినందించిన ఉపాధ్యాయులు
కొయ్యూరు: మండలంలోని రాజేంద్రపాలెం బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయస్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటారు. ఈ నెల 21న సామర్లకోట సూర్య డీఎన్‌ఆర్ కన్వెన్షన్ హాలులో నాలుగో ఓపెన్ జాతీయ స్థాయి కరాటే పోటీలు జరిగాయి. వీటిలో పాల్గొన్న ముర్ల ఈశ్వరి, కిముడు నందిని, పొత్తూరు లోవదుర్గ, శోభ స్వప్న కుమారి, బోనంగి గీత బంగారు పతకాలు సాధించారు. జర్సింగి నాగమణి, కొప్పుల భవాని, మఠం కారుణ్య వెండి పతకాలు పొందారు. వీరికి శిక్షణ ఇచ్చిన అకాడమి ప్రధాన కార్యదర్శి మర్రి శ్రీనును, ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఉపాధ్యాయులు బుధవారం అభినందించారు.


