గిరిజన మండలాలను కొత్త జిల్లాలో కలపాలి
సాక్షి, పాడేరు: పోలవరం నియోజకవర్గంలోని గిరిజన మండలాలను కొత్తగా ఏర్పాటు చేసే పోలవరం జిల్లాలో కలపాలని ఆ ప్రాంత సర్పంచ్‌లు కోరారు. కుక్కనూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాలకు చెందిన సర్పంచ్‌లు సోమవారం పాడేరులో కలెక్టరేట్‌కు వచ్చి ఇన్‌చార్జి డీఆర్‌వో అంబేద్కర్‌ను కలిశారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తుండడంతో ప్రస్తుతం ఉన్న పోలవరం నియోజకవర్గంలోని గిరిజన మండలాలకు న్యాయం చేయాలని వారు డీఆర్‌వోను కోరారు.పోలవరం జిల్లాలో ఆయా మండలాలను కలపాలని వినతిపత్రం అందజేశారు.


