గోరాపూర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
డుంబ్రిగుడ: మండలంలోని గోరాపుర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆంధ్ర– ఒడిశా సరిహద్దు రహదారి కిందన తుప్పల చాటున గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్‌ఐ సురేష్ తెలిపారు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలంలో చేరుకున్నట్టు చెప్పారు. మృతుడు ప్యాంటు, బ్రౌన్ రంగు బెల్టు, కుడి చేతిపై ఆంజనేయస్వామి బొమ్మ (టుటూ) ఉందన్నారు. మృతుడి వయసు సుమారు 25 ఏళ్లు ఉండవచ్చన్నారు. ఎస్‌ఐ సురేష్ మాట్లాడుతూ స్థానికులతో పాటు రైల్వే రోడ్డుకు పనికొచ్చిన వారిని విచారించామన్నారు. మృతుడి ఆచూకీ కోసం గోరాపుర్, గొడ్డిగుడ గ్రామస్తులను విచారించగా మతిస్థిమితం లేని వ్యక్తిగా గత అయిదు రోజులుగా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు స్థానికులు తెలిపారన్నారు. మృతదేహాన్ని అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతిపై అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.


