అందుబాటులోకి గోనె సంచులు
రాజవొమ్మంగి: మండలంలోని ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 10 వేల గోనె సంచులు సరఫరా చేశామని ఏఓ చక్రధర్ విలేకరులకు తెలిపారు. గోనె సంచుల కొరతతో రైతుల అవస్థలు అనే శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు వాతంగి సర్పంచ్ భీంరెడ్డి శుభలక్ష్మి తదితరులు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను కలిసి సంచుల కొరత గురించి ప్రస్తావించారు. దీంతో అనంతబాబు సంబంధిత అధికారులను ఫోన్‌లో సంప్రదించి గోనె సంచుల కొరత లేకుండా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు ఏర్పాటుచేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
అందుబాటులోకి గోనె సంచులు


