అనంతగిరి ఇన్‌చార్జ్ ఎంపీపీగా శకుంతల
అనంతగిరి(అరకులోయటౌన్): అనంతగిరి మండలం కివల్ల ఎంపీటీసీ, అనంతగిరి వైస్ ఎంపీపీ శకుంతల సోమవారం అనంతగిరి ఇన్‌చార్జీ ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణిపై గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టగా ఆమెకు వ్యతిరేకంగా 11 మంది ఓటువేశారు. దీంతో జెడ్పీ సీఈవో ఉత్తర్వుల మేరకు ఎంపీడీవో ప్రభాకర్ రావు కివర్ల ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ అయిన శకుంతలను ఇన్‌చార్జి ఎంపీపీగా నియమించి, ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీపీ నోటిఫికేషన్ వచ్చే వరకు ఇన్‌చార్జీ ఎంపీపీగా శకుంతల కొనసాగుతారని ఎంపీడీవో ప్రభాకర్‌రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


