అంబులెన్స్ సేవలు ప్రారంభం
చింతూరు: చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఎంపీ లాడ్స్‌తో మంజూరైన సరికొత్త అంబులెన్స్‌ను ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ సోమవారం ఆస్పత్రి వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ కోటిరెడ్డి, మెడికల్ ఆఫీసర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతబాబు మాట్లాడుతు ఎంపీ డాక్టర్ తనూజరాణి ఎంతో దూరదృష్టితో చింతూరు సీహెచ్‌సీకు నూతన అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. లోతట్టు ప్రాంత రోగులను అత్యవసరంగా ఆస్పత్రికి తరలించేందుకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు రామలింగారెడ్డి, కోట్ల కృష్ణ, జెట్పీటీసీ మురళి, ఎంపీపీ అమల, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.


