అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
రంపచోడవరం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీల పరిష్కారం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఐటీడీఏ గ్రీవెన్స్‌కు 71 అర్జీలు
ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం పీవో స్మరణ్‌రాజ్, సబ్ కలెక్టర్ సాహిత్‌లు పీజీఆర్‌ఎస్ నిర్వహించి, 71 అర్జీలు స్వీకరించారు. రంపచోడవరం మండలంలో గతంలో నిర్మించిన భూపతిపాలెం ప్రాజెక్టు ముంపు బాధితులైన 104 కుటుంబాలకు ఏఏవై రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఎంపీటీసీ తుర్రం వెంకటేశ్వరరావుదొర, కారం బాపన్నదొర తదితరులు అర్జీ అందజేశారు. గంగవరం నుంచి ఎండపల్లి వరకు నాలుగు కిలోమీటర్లు, బర్రెమామిడి నుంచి మర్రిపాలెం వరకు నాలుగు కిలోమీటర్ల ిబీటీ రోడ్లు నిర్మించాలని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి అర్జీ అందజేశారు. రంపచోడవరం మండలం కాకవాడ నుంచి వెట్టిచెలకలు, చెలకవీధి, దబ్బవలస గ్రామాలకు సంబంధించిన రోడ్డుకు మధ్యలో నాలుగు కల్వర్టులు మంజూరు కాగా మూడు కల్వర్టులు నిర్మించారని ఒక కల్వర్టు నిర్మించలేదని గిరిజనులు చోడి బాపన్నదొర, కుర్ల వెంకటరెడ్డి, పండురెడ్డిలు పీవోకు తెలిపారు. గంగవరం మండలం లక్కొండ పంచాయతీలో 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న 14 మందికి అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు మంజూరు చేయాలని యాట్ల సరస్వతి, పండా సోమలమ్మ, జర్తా సూర్యకుమారి తదితరులు అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డి.ఎన్.వి. రమణ, డీడీ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్


