ఆపదలో ఉన్నవారికి అండగా వైఎస్సార్‌సీపీ
చింతూరు: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులతో పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా వైఎస్సార్‌సీపీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు) అన్నారు. చింతూరు వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యుడు మల్లికార్జున్‌కు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి రావడంతో సోమవారం ఎమ్మెల్సీ అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఎమ్మెల్సీ వెంట జెడ్పీటీసీ సభ్యుడు చిచ్చడి మురళీ, మండల పార్టీ అధ్యక్షుడు వై.రామలింగారెడ్డి, కోట్ల కృష్ణ, సర్పంచ్ కారం కన్నారావు తదితరులున్నారు.
రాజవొమ్మంగి: రాజవొమ్మంగికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకురాలు నోరి వీరలక్ష్మిని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పరామర్శించారు. ఆమె కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. విషయం తెలిసిన నాయకులు ఆమెను స్వయంగా పలుకరించి ధైర్యం చెప్పారు. వీరలక్ష్మిని పరామర్శించిన వారిలో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ తదితరులున్నారు.
వి.ఆర్.పురం: వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు మాతృమూర్తి అమృతవల్లి మంగతాయారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామంలో సోమవారం నిర్వహించిన ఆమె సంస్మరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అనంతబాబు హాజరై మంగతాయారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మండల కన్వీనర్లు మాదిరెడ్డి సత్తిబాబు, రామలింగరెడ్డి, నాయకులు గంగులు, సత్యనారాయణ, బాలకృష్ణ, నరేష్, రామారావు, మరియదాసు, గాంగధర్, వీర్రాజు, కృష్ణ, చింతూరు జెడ్పీటీసీ సభ్యుడు చిచ్చాడి మురళీ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్నవారికి అండగా వైఎస్సార్‌సీపీ


