ఆధ్యాత్మిక చింతన అవసరం
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు
గూడెంకొత్తవీధి: మానవ జీవితానికి ఆధ్యాత్మిక చింతన అవసరమని, ప్రతీ ఒక్కరు భక్తి మార్గాన్ని అనుసరించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావు అన్నారు. పెదవలస పంచాయతీ చాపరాతిపాలెంలో నెతన ప్రార్థన మందిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావంతో ప్రశాంతత చేకూరుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ క్రిస్టీయన్ మైనార్టీ అధ్యక్షుడు వసుపతి తిమోతి, ఎంపీపీ బోయిన కుమారి, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ఉపాధ్యక్షులు, రైతు విబాగ రాష్ట్ర కార్యదర్శి భూసరి కృష్ణారావు, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు విజయకుమార్, తాడ సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి, యువజన విభాగం అధ్యక్షుడు రమేష్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు కంకిపాటి నారాయణ, నాయకులు కంకిపాటి శ్రీరాములు, బాలరాజు, రామారావు, సత్తిబాబు, ఆనందరావు, చందు, మూర్తి, శివకుమార్, శ్రీధర్ పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతన అవసరం


