‘సంక్షేమం’తో కుటుంబానికి ఆసరా
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు వసపరి వెంకటలక్ష్మి. చింతపల్లిలో నివసిస్తోంది. ఈమెకు ఇద్దరు పిల్లలు. భర్తతో కలిసి ఆమె కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు జగనన్న తోడు పథకంలో ఏడాదికి రూ.10వేలు, వైఎస్సార్ చేయూత కింద రూ.18,750, వైఎస్సార్ ఆసరాలో రూ.45 వేలు ఆమె ఖాతాలో నేరుగా జమ అయింది. ఇలా ఐదేళ్లలో ఆమెకు సుమారు రూ.1.75 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. వీటిని సద్వినియోగం చేసుకున్న ఆమె సొంతంగా కిరాణా దుకాణం ఏర్పాటుచేసుకుంది. ఒకప్పుడు కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఈమె ఇప్పుడు కిరాణా వ్యాపారంతో ఆర్థికాభివృద్ధి సాధించానని ఆమె పేర్కొంది.


