రైతు భరోసాతో ఆర్థికంగా ఎదుగుదల
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గొల్లోరి గోపి. ముంచంగిపుట్టు మండలం మాలిపుట్టు గ్రామం. వ్యవసాయమే జీవనాధారం. ఎన్నడూ లేనివిధంగా గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం ఎంతో ఉపయోగపడింది. ఏటా ఇచ్చిన పెట్టుబడి సాయం రూ.13,500ను తనకున్న రెండు ఎకరాల్లో సామలు, రాగుల సాగుకు ఉపయోగించాడు. ఈ పథకం లేకముందు ఏటా పెట్టుబడికి రూ.10 వేలు అప్పు చేసేవాడు. సకాలంలో రైతు భరోసా కేంద్రాల నుంచి విత్తనాలు, ఎరువులు పొందాడు. వలంటీర్ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు అందేలా చేసేవాడు. మాలాంటి రైతుల సంక్షేమం, ఆర్థిక ఎదుగుదలకు జగన్‌మోహనరెడ్డి చేసిన కృషి ఎన్నటికీ మరువలేమని అతను తెలిపాడు.


