గిరి విద్యార్థులకు వరం ఆంగ్ల మాధ్యమం
● కిల్లోగుడలో ఆధునిక వసతులతో
ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాల
● సద్వినియోగం చేసుకుంటున్న
602 మంది విద్యార్థులు
ట్యాబ్‌తో ఎంతో ఉపయోగం
నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు ట్యాబ్ ఇచ్చారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నా. జగనన్న ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌ను ఉపయోగించుకుని ఇంగ్లీష్, లెక్కలు, సోషల్, సైన్సు సబ్జెక్టుల్లో మంచిగా చదువుకుంటున్నా. ప్రతిరోజు ఉపాధ్యాయుల బోధించే అంశాలపై అవగాహన పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
– కిల్లో చిన్నమ్మి, కేజీబీవీ పాఠశాల, డుంబ్రిగుడ
అవగాహన పొందా..
గత ప్రభుత్వంలో అందించిన ట్యాబ్‌లతో సబ్జెక్టుపై ఎంతో కొంత అవగాహన పొందా. చదువుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇటువంటివి కొనుక్కునేందుకు మా కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిపోదు. ప్రస్తుతం టెన్త్ చదువుతున్న 80 విద్యార్థుల్లో అందరికీ ట్యాబ్‌లు ఉన్నాయి. దీనికి జగన్ అంకుల్ అందించిన సహకారమే.
– సొల్లొంగో అనూష, ఇంగ్లీష్ మీడియా పాఠశాల, కిల్లోగుడ
డుంబ్రిగుడ: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన నాడు – నేడు పథకంలో ఎన్నో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ఇందుకు కిలోగుడ ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలను ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక చిన్న ప్రాంతంలోని పాఠశాల, నేడు జాతీయ రహదారి పక్కన ఆధునిక వసతులతో 602 మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే స్థాయికి ఎదిగింది. మొదట్లో కిల్లోగుడలో దీనిని కేవలం మూడు గదుల్లో నిర్వహించేవారు. నాడు–నేడు పథకంలో ఈ పాఠశాలను అరకు ● పాడేరు జాతీయ రహదారిలో జైపూర్ జంక్షన్ నిర్మించారు. ఆధునిక వసతుల కల్పించి గిరి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. నేడు విశాలమైన భవనంలోకి మారడం వల్ల విద్యార్థులకు మెరుగైన వాతావరణం లభించింది. ఒకప్పుడు ధనిక వర్గాలకు మాత్రమే పరిమితం అనుకున్న ఇంగ్లీష్ మీడియం విద్యను, గిరిజన విద్యార్థులకు చేరువ చేయడంతో వారి భవిష్యత్తు పోటీ ప్రపంచానికి అనుగుణంగా మారుతుంది. వసతులు మెరుగుపడటంతో విద్యార్థుల సంఖ్య 602కు చేరడం అనేది ఆ పాఠశాల పట్ల ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం.
గిరి విద్యార్థులకు వరం ఆంగ్ల మాధ్యమం
గిరి విద్యార్థులకు వరం ఆంగ్ల మాధ్యమం
గిరి విద్యార్థులకు వరం ఆంగ్ల మాధ్యమం


