జగనన్న పాలనలో సంక్షేమ పరవళ్లు
సాక్షి, పాడేరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా ఏటా రూ.వందల కోట్లలో లబ్ధి చేకూరింది. ఏడాదికి రైతు భరోసా పథకంలో 1.68 లక్షల మందికి రూ.127 కోట్లు, అమ్మ ఒడి పథకంలో 1,01,170 మందికి రూ. 152 కోట్లు, పింఛను కానుకలో 1,28,562 మందికి రూ.465 కోట్లు, చేయూత పథకంలో 53,735 మందికి రూ.100.81కోట్లు ప్రభుత్వం అందజేసింది. ఆసరా పథకంలో 85,167 మందికి రూ.134.37కోట్లు, కాపునేస్తం 1510 మందికి రూ.2.26 కోట్లు, వాహనమిత్రలో 3353 మందికి రూ,3.35కోట్లు, సున్నా వడ్డీ పథకంలో 12,818 మందికి రూ.18,26కోట్లు, జగనన్న తోడు పథకంలో 7862 మందికి రూ,7.86 కోట్లు, కల్యాణమస్తులో 562 మందికి రూ.0.35కోట్లు, విద్యాదీవెనలో 13,578 మందికి రూ.17,31కోట్లు, వసతిదీవెనలో 7,550 మందికి రూ.7.25 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఆరోగ్యశ్రీలో 10,634 మందికి రూ.22,98 కోట్లు, గృహ నిర్మాణం 15,783కు రూ.62.98 కోట్లు, వైఎస్సార్‌బీమా 2058 మందికి రూ.26.33 కోట్లు అందజేసింది.


