ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకుంటే అంధకారమే
ఎటపాక మండలం జీకేపాడు గ్రామానికి చెందిన ఈమె పేరు వసంతాల ఇందిర. భార్యాభర్తలు ఓ ప్రైవేట్ హాస్టల్లో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నారు. వీరికి భవ్యశ్రీ, నవ్యశ్రీ ఇద్దరు సంతానం. వీరిని పెద్ద చదువులు చదివించలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జగనన్న ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న సాయం చూసి ఇద్దరు పిల్లలను ఉన్నతంగా చదివించాలని తల్లి ఇందిర ఆశించింది. 2018, 2019 సంవత్సరంలో టెన్త్ పూర్తిచేసిన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ సాయంతో ఇంటర్ చదివించింది. ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆసరాతో విజయవాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తిచేశారు. నవ్యశ్రీ బిటెక్ చివరి సంవత్సరంలో ప్లేస్‌మెంట్ సాధించి కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం పొందింది. కుటుంబంపై ఆర్థికభారం పడకుండా ఎటవంటి ఇబ్బందులకు గురికాకుండా నాడు జగనన్న ప్రభుత్వంలో అందించిన ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం ఎంతో సహాయపడిందని నవ్యశ్రీ ఎంతో గర్వంగా చెప్పింది. జగనన్న ప్రభుత్వం ఎందరో మాలాంటి పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆమె పేర్కొంది.


