ఉపాధ్యాయుల వినతి
పాడేరు రూరల్: అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్–1 విశాఖపట్నంలోనే కొనసాగించాలని జిల్లా విద్యా శాఖాధికారి రామకృష్ణారావుకు బహుజన్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు వల్ల సలీమ్, ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతు జోన్ –1 ఉమ్మడి విశాఖపట్నంలోనే కొనసాగిస్తేనే అందరి ఉపయోగం ఉంటుందని ఎటువంటి పనులు ఉన్న అనుకులంగా ఉంటుందన్నారు.జోన్–2 పరిధిలో చేర్చడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పవన్నారు. ప్రభుత్వం ప్రత్యేక చోరవ తీసుకుని అల్లూరి జిల్లాని జోన్–1 విశాఖపట్నంలోనే కోనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు, నాయకులు కర్రన్న, వేణుగోపాల్, లక్ష్మేశ్వరి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


