స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
సీలేరు: సీఆర్‌పీఎఫ్ –42 బెటాలియన్ సివిక్ యాక్షన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని బెటాలియన్ సెకండ్ కమాండెంట్ మహేంద్ర హెగ్డే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. గిరిజన మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్పంచ్ దుర్జీ మాట్లాడుతూ సీఆర్‌పీఎఫ్ సేవలను కొనియాడారు. హోమియో వైద్యాధికారి శృజనారాయ్, ఎంపీటీసీ సభ్యుడు పిల్లా సాంబమూర్తి, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.


