జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు తరలిరండి | - | Sakshi
Sakshi News home page

జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు తరలిరండి

Dec 20 2025 7:08 AM | Updated on Dec 20 2025 7:08 AM

జగన్‌

జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు తరలిరండి

పాడేరు : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు శుక్రవారం ఒక ప్రకటనలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పుట్టిన రోజు కేక్‌ కటింగ్‌లు, పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రమైన పాడేరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

అరకులోయటౌన్‌: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు జగనన్న జన్మదిన వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అరకులోయలోని వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద గల వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అనంతరం ఏరియా ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్ల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ పదవులు, హోదాల్లో ఉన్న పార్టీశ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఎటపాక: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

గంగవరం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కార్యాలయం వద్ద కేక్‌ కటింగ్‌ నిర్వహించి, రోగులకు పాలు, పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పార్టీశ్రేణులు, అభిమానులు తరలివచ్చి వేడుకను విజయవంతం చేయాలని కోరారు.

అరకు ఎమ్మెల్యే

రేగం మత్స్యలింగం

పాడేరు ఎమ్మెల్యే

మత్స్యరాస విశ్వేశ్వరరాజు

జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు తరలిరండి 1
1/1

జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు తరలిరండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement