సమస్యలు పరిష్కరించండి
● ఇన్‌చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో
తిరుమణి శ్రీపూజ
● పీజేఆర్‌ఎస్‌లో 156 వినతుల స్వీకరణ
పాడేరు : ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఇన్‌చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి 156 వినతులను ఆమెతోపాటు ఇన్‌చార్జి డీఆర్వో అంబేడ్కర్, ఇంచార్జీ ఆర్డీవో లోకేశ్వరరావు స్వీకరించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 నంబర్‌ను వినియోగించుకోవాలన్నారు. రెవెన్యూ, భూ వివాదాలకు సంబంధించిన ఆర్జీలపై తహాసీల్దార్లు, వీఆర్వోలు సమగ్ర సర్వే నిర్వహించి సమస్య పరిష్కారించాలన్నారు. ప్రధానంగా విద్యుత్, గృహాల మంజూరు, రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్యలు తదితర సమస్యలపై వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, భూగర్భ జలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నందు, డీఆర్డీఏ పీడీ మురళి, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, డీఎస్‌డీవో జగన్‌మోహన్‌రావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రమణారావు, డీపీవో చంద్రశేఖర్, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్ పాల్గొన్నారు.


