వెదురు వస్తువుల మార్కెటింగ్‌కు ప్రోత్సాహం
రంపచోడవరం: ఏజెన్సీలో వెదురుతో తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రోత్సాస్తామని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ తెలిపారు. మండలంలోని సుర్లవాడ గ్రామంలో గిరిజనులు వెదురుతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఇక్కడ గిరిజనులు తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేసి వెలుగు ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనులు వెదురు వస్తువుల తయారీలో నైపుణ్యాన్ని మరింత పెంచుకొనేందుకు శిక్షణ ఇస్తామన్నారు. మార్కెట్ ఏ విధంగా చేస్తున్నారో గిరిజనులతో మాట్లాడి తెలుసుకున్నారు. గిరిజనులు తయారు చేసిన వెదురు వస్తువులను పీవో పరిశీలించారు. పీవో వెంట ఏపీడీ డేగలయ్య, ఏపీం కిషోర్,రామరాజు పాల్గొన్నారు.


