రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీకి గాయాలు
కొయ్యూరు: వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు, డౌనూరు ఎంపీటీసీ సభ్యుడు బిడిజన అప్పారావు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతనిని వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఆయన శుక్రవారం ధర్మవరం నుంచి డౌనూరు బైక్‌పై వస్తున్నారు. ధర్మవరం దాటిన తర్వాత ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు ఆయన వాహనాన్ని ఢీ కొట్టారు. ఆయన బైక్ నుంచి పడిపోయారు. ఈ ప్రమాదంలో అప్పారావు ము క్కుకు, చేతికి గాయం కావడంతో స్థానికులు హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆయనను మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ముసిలినాయుడు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు జల్లి బాబులు, బూత్ కమిటీ కన్వీనర్ పొట్టిక పోతురాజు, సర్పంచ్‌లు పరామర్శించారు.


