
హైవే నిర్మాణానికిటేకు చెట్ల తొలగింపు
● చేపట్టిన అటవీశాఖ అధికారులు
అడ్డతీగల: జాతీయ రహదారి 516ఈ నిర్మాణానికి తపస్వికొండ రక్షిత అటవీ ప్రాంతంలో ఉన్న టేకు చెట్ల తొలగింపు పనులను మంగళవారం అటవీశాఖ అధికారులు ప్రారంభించారు. ఈపనులను రేంజ్ అధికారి షేక్ షహన్షా పర్యవేక్షిస్తున్నారు. రహదారి విస్తరణకు సంబంధించి 20 మీటర్లు మేర టేకు చెట్లను తొలగిస్తున్నామన్నారు. దీనివల్ల సుమారు 40 నుంచి 50 సీఎంటీల టేకు కలప సమకూరుతుందని రేంజ్ అధికారి తెలిపారు. సేకరించిన కలపను రాజమహేంద్రవరంలోని అటవీ శాఖ కలప డిపోకు తరలిస్తామన్నారు. ఇదే ప్లాంటేషన్‌లో ఉన్న మారుజాతి కలపతో పాటు టేకు పుల్లలు (ఫైర్ వుడ్)ను స్థానికంగా వేలం వేస్తామన్నారు.