
లోదొడ్డి పాఠశాలకుఇద్దరు టీచర్ల నియామకం
రాజవొమ్మంగి: మండలంలోని లోదొడ్డి ఆశ్రమపాఠశాలకు ఇరువురు ఉపాధ్యాయులను అధికారులు నియమించారు. ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ బోధించడం తెలిసిందే. ఈ సమస్యను గ్రామ సర్పంచ్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు సోమవారం రంపచోడవరంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం దృష్టికి తీసుకువెళ్లారు. ఉపాధ్యాయులను నియమించే వరకు కదిలేది లేదని ఆయన భీష్మించడంతో పీవో స్పందించారని ఆయన తెలిపారు. దీంతో ఆయన నియమించిన ఇద్దరు ఉపాధ్యాయులు విధుల్లో చేరారని ఆయన పేర్కొన్నారు.