
అదుపుతప్పిదమ్ము ట్రాక్టర్ బోల్తా
● డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ఎటపాక: వరి నాట్లు వేసేందుకు పొలంలో ట్రాక్టర్‌తో దమ్ము చేస్తుండగా అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మంగళవారం ఎటపాక మండలం గన్నవరం వద్ద జరిగింది. గన్నవరం, గౌరిదేవిపేట గ్రామాల మధ్య ఉన్న ముమ్మడివరం చెరువు వద్ద ఓ రైతు పొలంలో ట్రాక్టర్‌తో దమ్ము చేస్తుండగా గోతిలో దమ్ము చక్రం ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో గోతిలో నుంచి ట్రాక్టర్‌ను బయటకు తీసే ప్రయత్నంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మోరంపల్లి విష్ణు ట్రాక్టర్ స్టీరింగ్ మధ్య ఇరుక్కు పోయాడు. ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల వారు వచ్చి ట్రాక్టర్‌ను పైకిలేపి తీవ్ర గాయాలైన విష్ణుని సమీపంలోని గౌరిదేవిపేట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. డ్రైవర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.