
వేగంగా వంతెనలు, రోడ్డు నిర్మించండి
ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు
పాడేరు: వంతెనలు, రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసి ప్రజల అసౌకర్యాన్ని తొలగించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. ఇరడాపల్లి పంచాయతీలోని పలు గ్రామాలలో సోమవారం ఆయన పర్యటించారు. పంట పొలాలను, బొక్కెళ్ళు సమీపంలో నిర్మిస్తున్న రాయిగెడ్డ వంతెనను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న వంతెన అప్రోచ్ కోతను గురైందని ఆ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కాంట్రాక్టర్లకు సూచించారు