
వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి
ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
రంపచోడవరం/గంగవరం: వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. గంగవరం మండలం నెల్లిపూడి ట్రామ సమీపంలోని మెయిన్ రోడ్డుపై ఉన్న కల్వర్టును సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్, డీఎస్పీ సాయిప్రశాంత్‌లతో కలి సి పీవో సోమవారం పరిశీలించారు. వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో వర్షాలు తగ్గే వరకు సందర్శకులను అనుమతించవద్దన్నారు. ముఖ్యమైన ప్రాంతాల బాధ్యతను అధికారులకు అప్పగించామన్నారు.