
నిత్యావసర సరకుల కోసం వెళ్లి..
హుకుంపేట: అడ్డుమండ గ్రామానికి చెందిన కంబిడి కుమారస్వామి (45) వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. హుకుంపేట–పాడేరు మండలాల సరిహద్దు మోదాపుట్టు–అడ్డుమండను కలిపే ప్రధాన వంతెనపై వరద ప్రవాహం పెరిగింది. ఆదివారం సాయంత్రం కుమారస్వామి మోదాపుట్టు గ్రామానికి నిత్యావసర సరకుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా కల్వర్టు దాటే ప్రయత్నంలో కాలు జారి ఉప్పొంగిన ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్తులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కుమారస్వామి ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.