
గ్రామాల్లో సమస్యలపై అర్జీలు
రంపచోడవరం: రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్ , డీఎస్పీ సాయిప్రశాంత్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గిరిజనుల నుంచి 27 అర్జీలు వచ్చాయి. రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం గ్రామంలో సుమారు 40 ఏళ్లుగా సాగులో ఉన్న నాలుగు ఎకరాల భూమికి పట్టా మంజూరు చేయాలని కారం జగ్గాయమ్మ వినతి అందజేశారు. అలాగే తాళ్లపాలెం గ్రామానికి చెందిన టెంకి సీత తన కుమారుడు మూగవాడని, దివ్యాంగ పింఛను మంజూరు చేయాలని కోరారు. మారేడుమిల్లి గ్రామంలో సర్వే 42/2 గల ఇంటి స్థల సమస్య పరిష్కరించాలని కారు మహాలక్ష్మి కోరారు.
ఎస్‌డీసీ పి.అంబేడ్కర్, ఏపీఓ డీఎన్‌వీ రమణ
తదితరులు పాల్గొన్నారు.