
అసౌకర్యాలతో సతమతం
లబ్బూరులో ఏకలవ్య పాఠశాలలో తరగతులు ప్రారంభం
అరకొర సదుపాయాలతో విదార్థుల అవస్థలు
ఆవేదన వ్యక్తం చేస్తున్నవిద్యార్థుల తల్లిదండ్రులు
ముంచంగిపుట్టు: మండలంలో గల జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా ముంచంగిపుట్టు ఏకలవ్య పాఠశాల నిర్వహణ అంతా పెదబయలు మండల కేంద్రంలోని వైటీసీలో జరగుతూ వస్తుంది. ఐటీడీఏ పివో ఆదేశాల మేరకు సోమవారం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులకు లబ్బూరు పాఠశాలకు తరలించారు. రూ.12కోట్లతో నిర్మిస్తున్న లబ్బూరు పాఠశాల భవనాలు పూర్తికాకుండనే అధికారులు తరలించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రసుత్తం కురుస్తున్న వర్షాలకు కొన్ని గదుల్లోకి వర్షపు నీరు చేరి విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. ఏకలవ్య పాఠశాల తరలింపుపై కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరి కొంతమంది సౌకర్యాల కల్పనపై మండిపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వచ్చిన ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ రాముడుతో విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ లబ్బూరు ఏకలవ్య పాఠశాలలో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని, వర్షాపు నీరు గదులలోకి వస్తుందని,రాకుండా చర్యలు తీసుకోవాలని,అన్ని భవనాలు వేగంగా పూర్తి చేయాలని తల్లిదండ్రులు కోరారు.

అసౌకర్యాలతో సతమతం