
మారుమూల గ్రామాలకు నాణ్యమైన విద్యుత్
రంపచోడవరం: ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. స్ధానిక ఏపీఈపీడీసీఎల్ కార్యాలయాన్ని పీవో సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని విద్యుత్ సర్వీసులు ఏ విధంగా ఉన్నాయో సర్వే చేయాలన్నారు. మారుమూల గ్రామాలకు లోవోల్టేజీ లేని విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అటవీ అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో అడవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు నిఘా పెట్టి పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామాల్లో వినియోగించిన విద్యుత్‌కు సరైన సమయంలో బిల్లులు ఇవ్వాలని, వాటిని చెల్లించే విధంగా చూడాలన్నారు. ఈఈ గాబ్రియల్, డీఈ మల్లికార్జునరావు, ఏఈలు దొరబాబు, సాలెం బాబు, అబ్బాయిదొర, గోపాలకృష్ణ పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం