
జిల్లావ్యాప్తంగా 187.8 ఎంఎం వర్షపాతం నమోదు
సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరుతోపాటు సమీప గ్రామాల్లో రాత్రి 7గంటల నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన గెడ్డలు, వాగులకు వరద ఉధృతి నెలకొంది. మత్స్యగెడ్డలో వరద ప్రవాహం అధికంగా ఉండడంతో జోలాపుట్టు జలాశయంలోకి ఇన్‌ఫ్లో పెరిగింది. జిల్లావ్యాప్తంగా శనివారం 187.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దేవిపట్నంలో 39.4,అనంతగిరిలో 36.8,కూనవరంలో 29, వీఆర్‌పురంలో 15.6, రంపచోడవరంలో 13.8, ఎటపాకలో 12.4, మారేడుమిల్లిలో 5.8, రాజవొమ్మంగిలో 4.2, గంగవరంలో 3.6, డుంబ్రిగుడలో 3.6, వై.రామవరంలో 3.2, ముంచంగిపుట్టులో 2.8, పెదబయలులో 2, కొయ్యూరులో 2, అడ్డతీగలలో 1.8, జి.మాడుగులలో 1.2, అరకులోయలో 1, జీకేవీధిలో 0.6, పాడేరు 0.4 ఎంఎం వర్షపాతం నమోదైందని అధికారవర్గాలు తెలిపాయి.