
కరాటేతో ఆత్మరక్షణ
● పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
పాడేరు : విద్యార్థులు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు సూచించారు. ఇంటర్నేషనల్ కోపుకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో నెలకొల్పిన పాండు కరాటే క్లబ్ లోగోను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు.నీ సందర్భంగా అకాడమీలో తర్ఫీదు పొందుతున్న పలువురు విద్యార్ధులు, చిన్నారులు కరాటే విన్యాసాలను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యేను కరాటే క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో కరాటే క్లబ్ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ బాకూరు పాండురాజు, వైఎస్సార్‌సీపీ నేత తెడబారికి సురేష్‌కుమార్ పాల్గొన్నారు.