
ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
మోతుగూడెం: మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి పది గంటలకు మోతుగూడెం ఏపీ జెన్‌కో ఆస్పత్రిలో పనిచేస్తున్న గోసాలి అప్పారావు అనారోగ్య కారణాలతో మానసికంగా కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అప్పారావు గతంలో బైపాస్ సర్జరీ చేయించుకొని తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు తెలిపారు. దీంతో కలత చెందిన అతను ఇంట్లో ఐరన్ రాడ్‌కి ఉరి వేసుకొని మృతి చెందినట్టు చెప్పారు. దీనిపై మోతుగూడెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.