వీరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

Aug 16 2025 6:57 AM | Updated on Aug 16 2025 6:57 AM

వీరుల

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

● 15శాతం వృద్ధిరేటుతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి ● విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యసాధనకు మానిటరింగ్‌ యూనిట్లు ● కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ● వాడవాడలా ఘనంగా పంద్రాగస్టు వేడుకలు ● మువ్వన్నెల జెండా రెపరెపలు ● త్యాగమూర్తులకు ఘనంగా నివాళి

ఫైర్‌ జంప్‌ చేస్తున్న పోలీసు జాగిలం

కొయ్యూరు విద్యార్థుల మల్లకంబ విన్యాసాలు

సాక్షి,పాడేరు: దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలు చిరస్మరణీయమని,కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ అన్నారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో 79వ స్వాతంత్య్ర దిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోలీసుల కవాతు నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం జాతీ య జెండాను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌, జేసీ అభిషేక్‌గౌడ తదితర అధికారులు గౌరవవందనం సమర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులకు ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి ఆయన సందేశాన్నిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, వారి అనుచరులు గాం గంటందొర, మర్రి కామయ్య, గాం మల్లుదొర, పండుపడాల్‌, పనసలపెద్ది పడా ల్‌, తగ్గి వీరయ్య తదితర పోరాట యోధుల తాగ్యాలను స్మరించుకుంటూ జిల్లా ప్రగతి సాధిస్తామన్నారు. జిల్లాలో విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా స్థాయిలో ఒకటి, అరకులోయ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలలో మూడు విజన్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. రానున్న ఐదేళ్లలో ఏటా 15 శాతం వృద్ధిరేటు సాధనకు కృషి చేస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలనకు జిల్లాలో 91,214 అత్యంత పేద కుటుంబాలను గుర్తించి పి–4 కార్యక్రమం అమలుజేస్తున్నామన్నారు. ఇప్పటికి జిల్లాలో 21,613 కుటుంబాలను 769మంది దత్తత తీసుకున్నారన్నారు. గిరిజన విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, జిల్లా లో అర్హులైన 1,01,170 విద్యార్థుల తల్లుల ఖాతా ల్లో రూ.212.21కోట్ల తల్లికి వందనం నగదు జమ చేశామన్నారు. జిల్లాలోని 64 పీహెచ్‌సీలు, 297 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణం ,చింతపల్లిలో రూ.25 కోట్లతో సీహెచ్‌సీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయం,అనుబంధ రంగాలకు సంబంధించి 1,44,222 మంది రైతులకు రూ.7వేలు చొప్పున అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ నిధులలు రూ.101.84 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయగా, వీటిలో 81మంది ఉపాఽధి పొందుతున్నారన్నారు. రూ.10కోట్లతో మరో నాలుగు ప్రాజెక్ట్‌లకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో 248 రహదారులు లేని గ్రామాలను గుర్తించి రూ.618.89 కోట్లతో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. పీఎం జన్‌మన్‌ పథకంలో 146 రోడ్ల పనులకు రూ.393.42 కోట్లు మంజూరు కాగా వీటిలో రెండు పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయ న్నారు. రూ.115.56 కోట్లతో 51 రహదారులు, రూ.79.98 కోట్లతో 22 వంతెనల నిర్మాణానికి డీపీఆర్‌కు పంపామన్నారు. పీఎంజీఎస్‌వై పథకంలో 2024–25లో మంజూరైన రూ.179.70 కోట్ల రోడ్డు పనుల్లో ఆరు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 14 రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కాఫీ ప్రాజెక్టు అమలుతో పాటు పసుపు సాగు చేసే గిరిజన రైతులకు 922 మినీ బాయిలర్లు,432 మినీ పాలిసర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. పీఎం జన్‌మన్‌ పీఎం ఆవాస యోజన గృహ నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. అన్ని ప్రభుత్వశాఖల ద్వారా గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామ న్నారు. ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల అధికారు లు, అన్నివర్గాల ప్రజలు, పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. సబ్‌కలెక్టర్‌ సౌర్యమన్‌పటేల్‌, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌,పలుశాఖల జిల్లా అధికారులు పాల్గొ న్నారు. కలెక్టరేట్‌, స్థానిక ఐటీడీఏ కార్యాలయాల్లో జేసీ, ఇన్‌చార్జి పీవో డాక్టర్‌ అభిషేక్‌గౌడ, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌, అటవీశాఖ డివిజనల్‌ కార్యాలయంలో డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హేమలతాదేవి, మలేరియా శాఖ జిల్లా కార్యాలయంలో డీఎంవో తులసీ, విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో బ్రహ్మజీరావు జాతీయ జెండాను ఎగురవేశారు.

అలరించిన నృత్యాలు

స్థానిక తలారిసింగి క్రీడా మైదానంలో నిర్వహించిన వేడుకల్లో నృత్య రూపకాలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తలారిసింగి గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన కుంగుప్‌ విన్యాసాలకు ప్రథమ, పాడేరు కేజీబీవీ విద్యార్థినుల నృత్య రూపకానికి ద్వితీయ, లోచలిపుట్టు పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు తృతీయ స్థానం లభించాయి. కొయ్యూరు విద్యార్థుల మల్లకంబ విన్యాసాలు, నృత్యాంజలి డ్యాన్స్‌ అకాడమి చిన్నారుల దేశభక్తి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

శకటాల ప్రదర్శన

పలు ప్రభుత్వశాఖలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై శకటాలను ప్రదర్శించాయి. వ్యవసాయం, ఉద్యానవన శకటానికి ప్రథమ, గృహ నిర్మాణం, విద్యుత్‌ పంపిణీ సంస్థల శకటానికి ద్వితీయ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శకటానికి తృతీయ స్థానం లభించాయి. స్టాళ్లకు సంబంధించి అటవీశాఖకు ప్రథమ, కాఫీ బోర్డుకు ద్వితీయ స్థానం, డీఆర్‌డీఏ, వెలుగు సంస్థలకు తృతీయ స్థానం లభించాయి. మార్చ్‌పాస్ట్‌లో తలారిసింగి పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం, హుకుంపేట కేజీబీవీ విద్యార్థులు ద్వితీయ స్థానం, పాడేరు ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు తృతీయస్థానం సాధించారు.పోలీసు జాగిలాల ప్రదర్శన అందరినీ అబ్బురపరిచింది. అన్ని విభాగాలకు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ అమిత్‌బర్దర్‌, జేసీ అభిషేకగౌడ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

గిరిజనాభివృద్ధికి పాటుపడతాం :

చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌

చింతూరు: గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఐటీడీఏ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని స్థానిక ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కార్యాలయంలో ఆయన జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ కూనవరం మండలం పైడిగూడెంలో టస్సార్‌ సిల్క్‌ ప్రాజెక్టు అభివృద్ధి నిమిత్తం రూ.5 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. ఆధునిక యంత్రాల ద్వారా నాణ్యమైన దారాన్ని తీసి నేయడం ద్వారా ఈ ప్రాంతానికి మంచిపేరు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామల వెంకటరామయ్యను శాలువా కప్పి సత్కరించారు. అనంతరం వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా, ఏపీవో జగన్నాథరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్య పాల్గొన్నారు.

చింతపల్లి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీయ జెండాను ఏడీఆర్‌ అప్పలస్వామి ఎగురవేశారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను ఆయన అందజేశారు.

అమరవీరుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం : పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

సాక్షి,పాడేరు: అమరవీరుల త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందిని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులంతా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయనను ప్రిన్సి పాల్‌ శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. సీనియర్‌ లెక్చరర్‌ రమాదేవి,సీనియర్‌ అసిస్టెంట్‌ మహేష్‌, వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

రంపచోడవరం: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే శిరీషాదేవి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సోళ్ల బొజ్జిరెడ్డి, పీవో కట్టా సింహాచలం, సబ్‌ కలెక్టర్‌ శుభమ్‌ నొఖ్వాల్‌, డీఎఫ్‌వో రవీంద్రథామ, డీఎస్పీ సాయిప్రశాంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో జరిగిన అభివృద్ధిని పీవో వివరించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

వీరుల త్యాగాలు చిరస్మరణీయం1
1/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం2
2/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం3
3/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం4
4/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం5
5/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం6
6/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం7
7/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం8
8/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం9
9/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం10
10/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం11
11/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం12
12/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం13
13/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

వీరుల త్యాగాలు చిరస్మరణీయం14
14/14

వీరుల త్యాగాలు చిరస్మరణీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement