
సీ్త్రశక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
పాడేరు : సీ్త్ర శక్తి పథకం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసును మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొరతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వ్లును కచ్చితంగా అమలుచేసి పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అన్ని మార్గాల్లో మహిళలకు ఉచిత సేవలు అందించాలన్నారు. ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర మాట్లాడుతూ విజయనగరం రీజియన్‌లో 1779 బస్సులు ఉండగా 1352 బస్సులను మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేటాయించామన్నారు. మహిళలు ఆధార్ లేదా ఓటర్ కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చన్నారు. అనంతరం పాడేరు నుంచి ముంచంగిపుట్టు మండలం కుమడ మీదుగా బూసిపుట్టు బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దర్, జీసీసీ చైర్మన్ శ్రావణ్‌కుమార్, రాష్ట్ర సృజనాత్మకత, జానపద కళల చైర్మన్ గంగులయ్య, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, ఆర్టీసీ ఎండీ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్