సాక్షి,పాడేరు: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ సేవా పురస్కారాలు అందజేశారు. మొత్తం 238మంది ఆయన చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు. తలారిసింగి క్రీడా మైదానంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
ముంచంగిపుట్టు: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా ముంచంగిపుట్టు మండలానికి చెందిన ఇద్దరు లైన్‌మెన్‌లు చెట్టి భాస్కరరావు, శెట్టి బాలన్నలు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జి.వి.ప్రసాద్, ఈఈ వేణుగోపాల్‌రావుల చేతుల మీదగా అవార్డులతో పాటు ప్రశంసపత్రాలను అందుకున్నారు. వారికి అభినందనలు తెలిపారు.
గూడెంకొత్తవీఽధి: మండల హార్టీకల్చర్ అధికారి(కాఫీ) కోరాబు అరుణ కుమారి కలెక్టర్ దినేష్‌కుమార్ నుంచి శుక్రవారం అవార్డు అందుకున్నారు. హార్టీకల్చర్ అధికారిగా కుమారి చురుకై న పాత్ర పోషించారు. ఆమె ఉత్తమ సేవలను గుర్తించి ఆమెకు అవార్డును అందజేశారు.
ఎటపాక: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండలంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందజేసిన ఉత్తమ సేవలకు పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా ఐటీడీఏలో జరిగిన వేడుకల్లో పీవో అపూర్వభరత్ చేతుల మీదుగా ఎటపాక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కన్నపరాజు, కేఎన్ పురం ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గుంపెనపల్లి అచ్చమ్మలకు ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
గంగవరం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో పాడేరులో జరిగిన వేడుకలో గంగవరం పోలీస్‌స్టేషన్ హెచ్‌సీ పుండరీనాఽథ్, పీసీ కనిగిరి శ్రీనివాసులు కలెక్టర్ దినేష్‌కుమార్ చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు. డివిజన్ స్థాయిలో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ నోఖ్వాల్, ఎమ్మెల్యే శిరీష చేతుల మీదుగా తహసీల్దార్ సీహెచ్.శ్రీనివాసరావు, ఉపాధి ఏపీవో ప్రకాశ్, మండల వ్యవసాయాధికారి లక్ష్మణరావు, విద్యుత్‌శాఖ ఏఈ దొరబాబు, పిడతమామిడి పీహెచ్‌సీ ఎంపీహెచ్‌ఎస్ ప్రసాదరావు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ కె.కుమారి, ఎంపీడీవో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సత్యవతి, మొల్లేరు పంచాయతీ కార్యదర్శి వీరభద్రరావు తదితరులు అవార్డులు అందుకున్నారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు బేబీరత్నం, వైస్ ఎంపీపీ గంగాదేవి, రామతులసి, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, సర్పంచ్ అక్కమ్మ అభినందనలు తెలిపారు.
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు