
పలు రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌ల కొనసాగింపు
తాటిచెట్లపాలెం (విశాఖ): ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా ఆయా స్టేషన్లలో కొనసాగుతున్న హాల్ట్‌లను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి భువనేశ్వర్–సికింద్రాబాద్(17015) విశాఖ ఎక్స్‌ప్రెస్ సత్తెనపల్లె, పిడుగురాళ్లు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌ల్లోను, సెప్టెంబరు 20వ తేదీ నుంచి పూరీ–తిరుపతి (17479) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబరు 22వ తేదీ నుంచి తిరుపతి–పూరీ (17480) ఎక్స్‌ప్రెస్‌లకు కొవ్వూరు స్టేషన్‌లోను, సెప్టెంబరు 20వ తేదీ నుంచి బిలాస్‌పూర్–తిరుపతి(17481) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబరు 18వ తేదీ నుంచి తిరుపతి–బిలాస్‌పూర్(17482) ఎక్స్‌ప్రెస్‌లకు కొవ్వూరు స్టేషన్‌లో హాల్ట్‌లు కొనసాగుతాయి. భువనేశ్వర్–రామేశ్వరం(20896)(కొత్త నెంబర్20849) ఎక్స్‌ప్రెస్‌కు సెప్టెంబరు 26వ తేదీ నుంచి రాజమండ్రి స్టేషన్‌లో, రామేశ్వరం–భువనేశ్వర్(20895) కొత్త నెంబర్ 20850) ఎక్స్‌ప్రెస్‌కు సెప్టెంబరు 28వ తేదీ నుంచి రాజమండి స్టేషన్‌లో, హౌరా–పుదుచ్చేరి(12867) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు సెప్టెంబరు 28వ తేదీ నుంచి రాజమండ్రి స్టేషన్‌లో, పుదుచ్చేరి–హౌరా(12868)సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు సెప్టెంబరు 24వ తేదీ నుంచి రాజమండ్రి స్టేషన్‌ల్లో హాల్ట్‌లు కొనసాగుతాయి.