
ఏజెన్సీ డీఈవో పనసలపాలెం హాస్టల్ తనిఖీ
వై.రామవరం: మండలంలోని పనసలపాలెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను గురువారం ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువు సామర్‌ాధ్యలను పరీక్షించారు. రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు వండిన ఆహార పదార్థాల రుచి చూశారు. 10వ తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు సూచించారు. హాస్టల్‌లో జ్వర పీడిత విద్యార్థులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించడానికి తగు చర్యలు తీసుకోమని హెచ్‌ఎం, వార్డెన్లకు సూచించారు. ఎంఈవో కె.తాతబ్బాయిదొర, హెచ్‌ఎం అప్పలనాయుడు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.