
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
రంపచోడవరం: మండలంలోని తామరపల్లి పంచాయతీ ఈతలపాడు గ్రామంలో పారిశుధ్య పనులను ముసురుమిల్లి ఎంపీటీసీ కుంజం వంశీ గురువారం పరిశీలించారు. డ్రైనేజీల్లో పూడిక లేకుండా చూడాలని సూచించారు. అనంతరం జీపీఎస్ పాఠశాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పిల్లలకు గోరువెచ్చని నీటి ఇవ్వాలన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే పీహెచ్‌సీ, రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి వెళ్లాలన్నారు. పంచాయతీ కార్యదర్శి పండు, వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీను, మహిళా పోలీసు కృష్ణవేణి, ఏఎన్‌ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు.