
మాజీ ఎమ్మెల్యే పరామర్శ
సాక్షి, పాడేరు: వైఎస్సార్‌సీపీ నాయకుడు శెట్టి రవి గుండెపోటుతో తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు.పాడేరులో నివాసం ఉంటున్న రవికి ఒక్కసారిగా చాతినొప్పి రావడంతో హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఈ సమాచారం తెలుసుకున్న అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ జిల్లా ఆస్పత్రికి చేరుకుని రవిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఇక్కడ వైద్యులను ఆయన కోరారు. ఈ మేరకు రవిని కేజీహెచ్‌కు రిఫర్ చేశారు.పెదబయలు మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కాతారి సురేష్‌కుమార్ కూడా రవిని పరామర్శించారు.